వాలెంటైన్స్ డే స్పెషల్ కవిత

ప్రేమంటే ఏమిటంటే.?

చిరుజల్లుల తొలకరి స్పర్శవో..

చిదిమేసే బ్రతుకుల ఛత్రివో.

చిగురించే స్నేహపు పుత్రివో..

చిందర వందర లోకపు సృష్టివో..

చిరుమందహాసపు రూపువో..

చిరునవ్వుల జీవన మిసివో..

చిత్రమైన హృదయపు వలవో..

చిన్మయానంద ఊహల కలవో

చీకటి తొలగించే వెలుగుల తెరవో..

చింతాత్మక మదిని తాకే అలవో..