నిర్జీవంగా కళతప్పిన మొహానికి మెరిసేలా చేసే మేకప్ లేని చిట్కా
ముందుగా ముఖాన్ని నీళ్లతో బాగా కడగాలి
తడిలేకుండా పొడిబట్టతో తుడవాలి
తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటూ ఆవిరి పట్టాలి
ఒక కప్పులో టీ స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, రెండు చెంచాల అరటిపండు గుజ్జు వేసి, బాగా కలపాలి
ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలు ఆరనివ్వాలి
సగం కోసిన.. విత్తనాలు లేని నారింజతో ముఖంపై కాసేపు రుద్దాలి
2 లేదా 3 మూడు నిమిషాలయ్యాక చల్లటినీళ్లతో ముఖాన్ని కడగాలి
కాస్త మాయిశ్చరైజర్ ఫేస్ కు, లిప్‌బామ్ పెదవులకు రాయాలి
నిగనిగలాడే మెరుపుల మొఖం మీసొంతం అవుతుంది