మోకాలు, మోచేయి కి ఉండే నలుపు ఇబ్బంది పెడుతుంది

నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రాంతంలోని చర్మం గరుకుగా మారుతుంది

పచ్చిపాలలో నానబెట్టిన బాదం గింజలపేస్ట్ నల్లగా ఉన్న చోట పూయాలి

అరగంట తరువాత శుభ్రం చేస్తే అందులోని ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి

కలబంద గుజ్జుని గరుకుగా ఉన్న చోట పూసి ఒక గంట ఆరనీవాలి

తరువాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది

నిమ్మ చెక్కలో ఉప్పు కలిపి నల్లని ప్రదేశంలో మర్ధనా చేయాలి

ఆతరువాత గోరువెచ్చని నీటితో కడగాలి ఇలా వారానికి రెండు సార్లు చేయచ్చు

రెండు స్పూన్ల పెరుగులో మూడు చుక్కల వెనిగర్ కలిపి రాసి వేడి నీటితో కడగాలి

స్పూన్ చక్కెరలో నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి

ఒక 15 నిమిషాలు స్క్రబ్ చేసిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి