నైమిశారణ్యంలో సూతమహాముని శైనకాది మునులకు వినాయక వ్రత కథ, పుట్టుక, చవితి చంద్రుడి దర్శనం, దోష నివారణ గురించి చెప్పడం

గజాసురుడు అనే రాక్షసుడి తపస్సును మెచ్చిన శివుడు వరం కోరుకోమనగా రాక్షసుడు ఎప్పుడూ తన కడుపులో ఉండాలని కోరుకున్నాడు

తదాస్తు అని వరమిచ్చిన శివుడు కనపడకపోవడంతో ఆయన జాడ వెతుకుతూ వచ్చిన పార్వతికి తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకున్నారు

పరిష్కారం కోసం  విష్ణుమూర్తిని ఆశ్రయించడంతో సన్నాయి ప్రదర్శనతో గజాసురుడుని మెప్పించి శివుడిని ఇంటికి పంపించేందుకు సిద్దమయ్యాడు

పార్వతీ దేవి నులుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేసేందుకు వెళుతూ వినయకుడిని లోనికి ఎవరూ రాకుండా చూడమని చెబుతుంది

అప్పుడే శివుడు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా తండ్రీ కొడుకుల మధ్య యుద్దం జరిగి గజాననుడి కంఠాన్ని తన త్రిశూలంలో వధిస్తాడు శివుడు

విషయం తెలుసుకున్న పార్వతీ దేవి పుత్ర శోకంతో ఉండగా ఉత్తర దిక్కుగా నిద్రించి ఉన్న ఏనుగు తలను నరికి వినాయకుడికి అతికిస్తాడు

ముల్లోకాలలోని సకల పుణ్య క్షేత్రాలు, పుణ్య నదీ తీర్థాలు దర్శించి ఎవరు ముందుగా కైలాసానికి చేరుతారో వారే సకల గణాలకు అధిపతి అని నిర్ణయిస్తారు

త్రిలోకాలకు అధిపతిని చేయడం కోసం కుమార స్వామి, గజాననుడికి ఒక పరీక్ష పెట్టగా ప్రతి చోట కుమార స్వామి కంటే ముందుగా గజాననుడు గెలుస్తాడు

పట్టాభిషిక్తుడైన విఘ్నేశ్వరుడు సకల నైవేద్యాలు భుజిచి ఆయాసంతో కైలాసం ఎక్కడం చూసి చంద్రడు అపహాస్యం చేస్తాడు

దీంతో ఆగ్రహించిన గణపతి చవితి నాడు నిన్ను ఎవరైతే చూస్తారో వారు నీలాపనిందలు ఎదుర్కొని అష్టకష్టాలు అనుభవింతురు గాక అని శపిస్తాడు

ఈ క్రమంలో పార్వతీ దేవి శాపం వల్ల సప్తరుషుల భార్యలందరూ నీలాపనిందలు అనుభవిస్తూ కృషించి పార్వతిని శరణువేడగా వినాయక వ్రతకల్పం గురించి వివరిస్తారు

శ్యమంతకోపాఖ్యానంలో శ్రీ కృష్ణుడు కూడా పాలకుండలో చవితి చంద్రుడిని చూసి సత్రాజిత్తు తమ్ముడిని శ్యమంతకమణి కోసం చంపి ఉంటాడన్న నిందలు పడతాడు

దీని కోసం అడవులకు వెళ్ళి సింహం అడుగు జాడల ద్వారా మణిని కనుగొని వస్తుండగా జాంబవంతుడు గొడవపడి నీరసించి  శ్రీరాముని అంశ అయిన శ్రీకృష్ణుడు అని భావిస్తాడు

ఆ మణిని శ్రీకృష్ణుడి ద్వారా సత్రాజిత్తుకి అందించి నింద పోగొట్టుకోవడంతో తన కూతురు సత్యభామను ఇచ్చి వివాహం చేసేందుకు సిద్దమౌతాడు దీంతో కథ ముగుస్తుంది