మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా, నాలుగున్నర నిమిషాల డ్రాగన్ గ్లింప్స్ మత్తులోనే తేలిపోతున్నట్టున్నారు. ఇంత పెద్ద సర్ ప్రైజ్ ఎన్టీఆర్ నుంచి ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు.. వాళ్ల ఆకలి తీర్చేలా ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ షాక్ లాంటి కిక్ ఇచ్చాడు. అంతా బానే ఉంది. ఇక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్, ఇంకో బిగ్ న్యూస్ షాక్ ఇస్తున్నాయి.. ఆల్రెడీ దేవర 2 అప్ డేట్ ఎందుకు ఎన్టీఆర్ బర్త్ డే రోజు రాలేదనే ప్రశ్న ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. సరే దేవర 2 మీద చాలా కన్ ఫ్యూజన్స్ నడుస్తున్నాయి కాబట్టి, అది పక్కన పెట్టొచ్చు..కాని గాడ్ ఆఫ్ వార్ కి ఏమైంది? లార్డ్ మురుగన్ బేస్డ్ మైథాలజీ నుంచి సౌండ్ లేదేంటి? ఇవి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రశ్నాలు.. దాంట్లో ఒక ప్రశ్నకి త్రివిక్రమ్ టీం సాలిడ్ న్యూస్ తో కిక్ ఇస్తోంది... కాని ఇందులో బిగ్ షాక్ కి మాత్రం ఆన్సర్ లేదు.. ఏంటది? ఎందుకలా?
డ్రాగన్ గ్లింప్స్ పాన్ ఇండియా మొత్తం షాక్ వేవ్ ని క్రియేట్ చేసింది. సలార్ తో సోసో అనిపించుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ని ముంచేస్తాడా? గట్టెక్కిస్తాడా అన్న అనుమానాలన్నీ గాల్లో కలిసిపోయాయి. వందకాదు వెయ్యి సలార్లు కలిపినా డ్రాగన్ గ్లింప్స్ తో సమానం కాదనేంత రెస్పాన్స్ వచ్చింది. కేవలం గ్లింప్స్ కే ఈ స్థాయిలో రీసౌండ్ వస్తే, ఇక సినిమా ఏస్థాయిలో మైండ్ బ్లాంక్ చేస్తుందో అన్న అంచనాలు కూడా పెరిగాయి.కట్ చేస్తే రెండు ప్రశ్నలు గట్టిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రేయిన్ లో మెదులుతున్నాయి...అదే దేవర 2 ఏమైంది? గాడ్ ఆఫ్ వార్ పరిస్థితేంటి? ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ అప్ డేటే కాదు, గాడ్ ఆఫ్ వార్ వీడియో రాబోతోందన్నారు. దేవర 2 అప్ డేట్ కూడా ఇవ్వబోతున్నట్టు కొరటాల శివ రెండు వారాల క్రితం పెట్టిన పోస్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించింది.
కట్ చేస్తే ఎన్టీఆర్ బర్త్ డే రోజు మాత్రం డ్రాగన్ గ్లింప్స్ తప్ప మరేం రాలేదు. దేవర 2 అప్ డేట్ ని కొరటాల శివ ఎందుకు ఇవ్వలేదు.. నిజంగానే దేవర 2 లేదా? రాదా? ఎన్టీఆర్ నిజంగానే దేవర సీక్వెల్ ని పక్కన పెట్టాడా? లాంటి పాత డౌట్లే కొత్తగా మళ్లీ మొదలయ్యాయి.. ఇక గాడ్ ఆఫ్ వార్ టీం అయితే ఇంకా లాంచ్ కాని సినమా కోసం ఏకంగా ఏఐ తో వీడియో రెడీ చేసి, ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ప్లాన్ చేసింది.ఆల్రెడీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఎనౌన్స్ మెంట్ వచ్చింది. తన ఫిల్మ్ టీం ఏకంగా రెండు నిమిషాల స్పెషల్ వీడియో అంటూ ఫీలర్స్ వదిలింది. కట్ చేస్తే మే 19, మే 20 రెండు డేట్లలో ఎలాంటి అప్ డేట్ లేదు. కాని జూన్ లో మాత్రం గాడ్ ఆఫ్ వార్ టీం పెద్ద షాక్ వేవ్ కి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. కారనం, బర్త్ డే రోజు డ్రాగన్ తప్ప ఇంకేం అప్ డేట్స్ వద్దని ఎన్టీఆర్ నుంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇటు త్రివిక్రమ్, అటు కొరటాల శివ ఇద్దరికీ వెల్లాయని తెలుస్తోంది.
ఎందుకంటే డ్రాగన్ ని అంత ప్రెస్టీజియస్ గా ఎన్టీఆర్ కన్సిడర్ చేస్తున్నాడట. అసలే నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ వదులుతుంటే, జనాలు ఇది తప్ప మరో మూవీ గురించి మాట్లాడ్డం అంటే, ఈ కష్టాన్ని , ఈ సినిమా మీద క్రియేట్ అయ్యే బజ్ ని డైల్యూట్ చేయటమే.. అందుకే డ్రాగన్ గ్లింప్స్ ని మాత్రమే ఎన్టీఆర్ బర్త్ డేకి వదిలారని తెలుస్తోంది. అలాని త్రివిక్రమ్ టీం రెడీ చేసిన వీడియో పక్కన పెట్టినట్టు కాదు. దాన్నిజూన్ 11న రిలీజ్ చేయబోతున్నారట. వచ్చే ఏడాది ఇదే రోజు అంటేజూన్ 11నే డ్రాగన్ రాబోతోంది, అదే రోజు గాడ్ ఆఫ్ మాసెస్ మొదలౌతుందనే మెసేజ్ తో త్రివిక్రమ్ ఈ వీడియోని వచ్చేనెల 11న లాంచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
సో ఇక్కడ గాడ్ ఆఫ్ వార్ విషయంలో గుడ్ న్యూస్ తో క్లారిటీ వచ్చింది. కాని దేవర 2 బిగ్ న్యూస్ పరిస్థితే అర్ధం కావట్లేదు. దానికి కూడా ఏదైనా డేట్ చూసుకుని దేవర2 ఎనౌన్స్ మెంట్ ని కొరటాల శివ ఇస్తాడా చూడాలి? కాకపోతే జూన్ 10న బాలయ్య బర్త్ డే రోజు, తనతో సినిమా ఎనౌన్స్ మెంట్లు ఉంటాయి. కారణం ఆ ప్రాజెక్టే ముందు మొదలు కాబోతోంది. కాబట్టి జూన్ నెలలో కాకుండా ఆగస్ట్ లో దేవర 2 అప్ డేట్ ఇస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ జరుగుతోందట. కాని ఎన్టీఆర్ బర్త్ డే అయిపోయిన మూడునెలలకు దేవర 2 ఎనౌన్స్ మెంట్ లు, అప్ డేట్లు ఇస్తే ఇంపాక్ట్ ఉండదనే డైలామాలో పడింది కొరటాల శివ టీం... మరి ఈనెలాఖర్లో, వచ్చేనెలాఖర్లో, కాదంటే జూలైలో ఇవ్వొచ్చు కదా అంటే, బాలయ్య తోమూవీ ఎనౌన్స్ అయ్యాక, దేవర 2 అప్ డేట్ ని ఇస్తే ఎన్టీఆర్ బర్త్ డే కి ఇవ్వాలి, లేదంటే, ఏదైనా పండగ రోజు వరకు వేయిట్ చేయాలి.. ఇది కొరటాల శివ పరిస్థితని తెలుస్తోంది.