డ్రాగన్ గ్లింప్స్ పేలాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత గాల్లో తేలిపోయారో... అంతకు రివర్స్ లో రెబల్ ఫ్యాన్స్ షాక్ లో ఉండిపోయారు. అంతటికీ కారణం ఒకే ఒక ఇంటర్వూ... ఆ ఇంటర్వూలో ప్రశాంత్ నీల్ పేల్చిన బాంబు... డ్రాగన్ మూవీనే తన కెరీర్ లో చివరి గ్యాంగ్ స్టర్ మూవీఅన్నట్టు మాట్లాడాడు.. అంతే ఆమాటతో ఇక స్పిరిట్ సీక్వెల్ స్పిరిట్ 2 ఉండగా అన్న షాక్ వేవ్ మొదలైంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఎటాక్ ప్రశాంత్ నీల్ ని కంగారుపెట్టినట్టుంది. మొత్తానికి సలార్ సీక్వెల్ ఉంటుందని తనే స్టేట్ మెంట్ ఇచ్చే వరకు సీన్ మారిపోయింది. అంతవరకు బానే ఉంది కాని, ఇక్కడి నుంచే ప్రశాంత్ నీల్ కి కష్టాలు మొదలయ్యాయి... డ్రాగనే చివరి గ్యాంగ్ స్టర్ మూవీ అన్న ప్రశాంత్ నీల్ సడన్ గా డ్రాగన్ రిలీజైన 2027 లోనే స్పిరిట్ 2 మొదలౌతుందన్నాడు.. ఇక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు.. అంటే 2027లో డ్రాగన్ రిలీజ్ కాగానే స్పిరిట్ 2 మొదలైతే, డ్రాగన్ 2 లేనట్టేనా? ఈ ప్రశ్నే ప్రశాంత్ నీల్ కి ఎదురైంది? ఇంతకి దీనికి సమాధానం తో మ్యాన్ ఆఫ్ మాసెస్ లో పూనకాలు మొదలయ్యేఛాన్స్ఉందా? ఫైనల్ ఆన్సర్ ఏంటి?
డ్రాగన్ గ్లింప్స్ వచ్చాక మార్కెట్ షేక్ అయ్యిందనుకునేలోపు, సలార్ 2, డ్రాగన్ 2 అంశం ఇప్పడు సోసల్ మీడియానే షేక్ చేస్తోంది. ఇదే నిజంగా ఎవరూ ఊహించని షాక్.. అంతా ఒకే ఒక్క ఇంటర్వూ తో వచ్చిన సమస్య. ఏదో డ్రాగన్ గ్లింప్స్ ని నాలుగున్నర నిమిషాల డ్యూరేషన్ తో వదిలారనే సంతోషంలో, ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వూలో రెచ్చిపోయిన స్టేట్ మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడదే తన కొంపముంచుతోంది.ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తనకి గట్టిగా ఇచ్చిపడేశారు.. వెంటనే సీన్ లోకొచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. ఇదోరకంగా వరద తర్వాత వచ్చిన బురదలా ఉంది పరిస్తితి... అసలు విషయం ఏంటంటే, డ్రాగన్ గ్లింప్స్ లాంచ్ చేసిన రోజే ఒక ఇంటర్ వ్యూ వచ్చింది. డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ ఇంటర్వూలో, డ్రాగనే తన చివరి గ్యాంగ్ స్టర్ మూవీ అన్నాడు.
తనెప్పటి నుంచో ఒక మైథలాజికల్ డ్రామా చేయాలనుకుంటున్నట్టు తేల్చాడు. ఆల్ మోస్ట్ గ్యాంగ్ స్టర్ మూవీలకు డ్రాగన్ తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు తేల్చాడు. అంతే వెంటనే అలర్ట్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, అంటే స్పిరిట్ ఉండదా? మరి శౌర్యంగా పర్వంలోనే అసలు కథ ఉందన్నావు కదా? ఇలా వరుసగా ట్వీట్లతో ఇచ్చిపడేశారు..దాని ఎఫెక్ట్ తగిలేపోలే... స్పిరిట్ సీక్వెల్ ఆగదు.. నెక్ట్స్ అదే అని తేల్చాడు. డ్రాగనే తన చివరి గ్యాంగ్ స్టర్ మూవీ అంటే, దానర్ధం, స్పిరిట్ 2 ఆపేస్తున్నట్టు కాదని.. ఆల్రెడీ తీసిన మూవీనే కాబట్టి, దాని సీక్వెల్ తీస్తే కొత్తగా గ్యాంగ్ స్టర్ మూవీని కంటిన్యూ చేసినట్టు కాదు.. పాత కథనే కంటిన్యూ చేయబోతున్నాడు కాబట్టి, అలా డ్రాగనే లాస్ట్ గ్యాంగ్ స్టర్ మూవీ అన్నట్టు తేల్చాడు.
ఇంతవరకు ఓకే, ఆతర్వాత ఇచ్చిన స్టేట్ మెంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యేలా చేసింది. 2027 జూన్ లో డ్రాగన్ రిలీజ్ అయిన వెంటనే సలార్ సీక్వెల్ సలార్ 2 షూటింగ్ మొదలౌతుందని ప్రశాంత్ నీల్ చెప్పటంతో, అంటే డ్రాగన్ సీక్వెల్ పరిస్థితేంటనే ప్రశ్న ఎదురౌతోంది. అసలు డ్రాగన్ రెండు భాగాలా కాదా, అన్నది గ్లింప్స్ తో తేల్చలేదు ప్రశాంత్ నీల్... కాబట్టి డ్రాగన్ 2 ఎప్పుడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవటంలో అర్ధం లేదు. కాని డ్రాగన్ గ్లింప్స్ చూస్తే, అందులో అఫ్ఘాన్ కంపెనీ మీదే గ్లింప్స్ అంతా ఉంది. గోల్డెన్ ట్రైయాంగిల్ కంపెనీ డిటేల్స్ లేవు..
అలానే హీరో పేరు లూగర్ అని ఉండటంతో, అసలు డ్రాగెన్ తన తాతో తండ్రి పాత్రదో పేరు అయ్యుండొచ్చనే అంచానలున్నాయి. సో డ్రాగన్ 2 కూడా వస్తుంది కాని, టీజర్ లోనే ఆ విషయం ఎనౌన్స్ చేస్తారనే అంచనాలుకూడా కనిపిస్తున్నాయి. అయితే, మరి డ్రాగన్ రిలీజ్ కాగానే, సలార్ 2 మొదలైతే, డ్రాగన్ 2 ఎప్పుడనే ప్రశ్నకు బదులేది? ఇక్కడే ట్విస్ట్ ఉంది. సలార్ లా ఒక మూవీ వచ్చాక,మరో సినిమా తీయటం కాకుండా, డ్రాగన్ మొదటి భాగం, రెండో భాగం కలిపే షూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కాబట్టి డ్రాగన్ ఒకటి రిలీజ్ అయ్యాక సలార్ 2 మొదలు పెట్టి, ఈలోపు డ్రాగన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అందుకే సలార్ 2 అగానే, డ్రాగన్ 2 ఎప్పుడని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడన్ గా ఎటాక్ చేయాల్సిన పనిలేదనే మాటే ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తోంది.