వర్షాకాలం అనేక రోగాలకు కారణం అవుతుంది
మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్స్ సహజంగా ప్రబలుతాయి
అలాగే సాధారణ జలుబు, జ్వరం, దగ్గు వంటివి ధరిచేరుతాయి
హాస్పిటల్స్ కి వెళితే వేలకు వేలు డబ్బులు ఖర్చు అవుతాయి
మరి ఇలాంటి వాటిని నివారించేందుకు ఏం చేయాలో చూద్దాం
ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేసుకోవాలి
డాక్టర్లను సంప్రదించి ముందస్తు ఫ్లూ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి
డ్రై ఫ్రూట్స్, బత్తాయి, పెరుగు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ప్రతి రోజూ ఒకసారి ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు మెరుగ్గా పనిచేస్తాయి
తద్వారా బ్యాక్టీరియా, వైరస్లు నశించే ఆస్కారం ఉంటుంది
దీంతో ఇంట్లోనే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు