సాధారణంగా దేవతా మూర్తులను మెడలో వేసుకుంటారు

మరికొందరైతే తమ పేరులోని మొదటి అక్షరాన్ని లాకెట్ గా ధరిస్తారు

మత సాంప్రదాయాలకు అనుగుణంగా సింబల్స్ ని ఎంచుకుంటారు

దేశ భక్తికి ప్రతీకగా తిరంగా లాకేట్ లను ఉపయోగింస్తూ ఉంటారు

కానీ వెరైటీగా పురుగులతో చేసిన ఆభరణాలను వాడుతున్నారు

వీటిని ఇన్‌సెక్ట్‌ జువెలరీ అంటారు

ఇందులో ఈగలు, బొద్దింకలు, చీమలు, తేనెటీగలు, తుమ్మెదలు, మిడతలు రకరకాలుగా ఉంటాయి

ఇవి ఈజిప్ట్ నాగరికతకు చెందినవిగా నాటి చరిత్ర చెబుతోంది

ఇదే నేటికి ఫ్యాషన్ గా ట్రెండ్ అవుతోంది

గ్రీకు పురాణం ప్రకారం.. ఓ రాకుమారి శత్రు తెగకు చెందిన యువరాజును ప్రేమిస్తుందట

వారి పెండ్లికి పెద్దలు ఒప్పుకోని కారణంగా ఆత్మహత్య చేసుకొని.. మరోజన్మలో పురుగుగా జన్మిస్తుంది

ఆ యువరాజు కంఠాభరణంగామారి తన ప్రేమికుడి గుండెలపై ఒదిగిపోయింది