నేటి సమాజంలో కొందరు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
అందులో భాగంగా మట్టితో ఎకో గ్రీన్ గణేష్ ని తయారు చేస్తున్నారు
ఈ సంప్రదాయం రాఖీ పండుగవైపుకు కూడా మళ్ళింది
అన్నా- చెల్లెళ్లు, అక్కా – తమ్ముడికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు
గతంలో రంగురంగుల ప్లాస్టిక్ పేపర్లతో తయారు చేసిన వాటిని కట్టేవారు
ఇప్పుడు మట్టితో రాఖీలను తయారు చేసేలా ట్రెండ్ మారింది
అంతేకాకుండా ఆవు పేడతో కూడా వీటిని తయారు చేస్తున్నారు
వివిధ వాటర్ కలర్స్ అద్ది అందంగా రూపుదిద్దుతున్నారు
చిన్న పిల్లలను ఆకర్షించేందుకు చాక్లెట్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి
వివిధ రకాలా డిజైన్లలో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి