నేటి కాలంలో అద్దాన్ని, అందాన్ని ఎవరూ వదులుకోరు

మరి వేసవి కాలం మొదలైపోయింది

అద్దం వదలుకోకున్నా.. అందాన్ని వదిలేయాల్సి వస్తుంది

దీనికి కారణం తీవ్రంగా మండే ఎండలు

మీమొఖాన్ని కమిలిపోయేలా చేస్తాయి

మరి దీనికి సింపుల్ రెమెడీ తెలుసుకోండి

ఐస్ క్యూబ్ ట్రేలో నీళ్లు తీసుకోండి

అందులో నాలుగు తులసి ఆకులతో పాటూ రోజా రెక్కలు వేయండి

అది త్వరగా గడ్డ కట్టేలా ఫ్రిజ్ టెంపరేచర్ సరిచేయండి

ఇలా మంచు ముక్కలా అయ్యే వరకూ వేచి ఉండండి

ఆపై మంచు ముక్కతో ముఖాన్ని మర్థనా చేయండి

పది నిమిషాలు ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు మీసొంతం

ఇందులో పుదినే, గ్రీన్ టీ ఆకులు వేరు వేరుగా ఉపయోగించవచ్చు

అలాగే సన్నని నిమ్మ ముక్కలు, అలోవెరా గుజ్జు కూడా వాడుకోవచ్చు

కీరాతో పాటూ వివిధ రకాల పండ్లతో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు