ఆకాశంలో అద్భుతం..  పింక్ మూన్.. ఇండియాలో చూడొచ్చా?

చంద్రుడు గులాబి రంగులో ఏడాదికోసారి కనిపిస్తుంటాడు

ఇలా కనిపించడాన్ని పింక్ మూన్ అంటారు

విదేశాల్లో పాశ్చల్, పెసాక్, పాసోవర్ మూన్ అని కూడా పిలుస్తారు

ఈ బుధవారం (ఏప్రిల్ 5) రాత్రి పింక్ మూన్ కనిపించబోతుంది

ఆ రోజు చంద్రుడు అత్యంత ప్రకాశవంతం కావడం వల్ల ఇలా కనిపిస్తాడు

వసంత కాలంలో వచ్చే మొదటి పౌర్ణమి సందర్భంగా ఇలా నిండుగా దర్శనమిస్తాడు

భారత కాలమానం ప్రకారం ఉదయం 10.07 నిమిషాలకు పింక్ మూన్ కనిపిస్తుంది

అందువల్ల మన దేశంలో పింక్ మూన్ చూసే అవకాశం లేదు

ఈ ఏడాది తర్వాత మళ్లీ 24 ఏప్రిల్, 2024న పింక్ మూన్ దర్శనమిస్తుంది