ఫ్రిజ్ ను ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు ఉపయోగిస్తారు

ఇలా చేయడం ఆరోగ్యకరమా.. కాదా.? తెలుసుకుందాం

సాధారణంగా మనం ఆకుకూరలతో పాటూ చిరు ధాన్యాలు ఫ్రిజ్లో నిలువ ఉంచుతాం

వీటితో పాటూ వండిన పదార్థాలను కూడా ఫ్రీజ్ చేస్తారు

ఇలా నిలువ చేసిన వాటిని 2 లేదా 3 రోజులు కూలింగ్ లో ఉంచి వినియోగిస్తారు

ఫ్రిజ్‌లో పెట్టిన ఏ పదార్థాన్ని అయినా బయటికి తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చేదాకా వేచి ఉండాలి

సాధారణ స్థితికి వచ్చాక ఉపయోగించుకోవాలి. ఇలా చేయడాన్ని తావింగ్ అంటారు

వండిన పప్పు, కూరల్లాంటి  వాటిని తయారు చేసిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి

అలా అయితేనే దాదాపు 48 గంటల వరకూ పాడవకుండా ఉంటాయి

రెండు గంటల తరువాత అయితే వండిన వాటిలో బ్యాక్టీరియా ఫాం అవుతుంది

ఇదే క్రమంలో మాంసాన్ని నిలువ చేసేందుకు డీప్ ఫ్రిజర్ ను ఉపయోగించాలి

ఇలా చేస్తే రెండు రోజుల పాటూ మాంసం తాజాగా ఉంటుంది

పండ్లూ, కూరగాయలు అయితే వారం నుంచి 10 రోజుల వరకూ పాడవకుండా ఉంటాయి

అప్పటికప్పుడు తినే ఆహార పదార్థాలతో పోలిస్తే.. నిల్వ ఉంచిన వాటిలోని పోషక విలువలు సన్నగిల్లుతాయి

ఆస్తమా, సైనసైటిస్‌, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇలా చేయకపోవడం ఉత్తమం