మొక్కలు పెంచాలని ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది
అయితే ప్రయాణాల సమయంలో వాటి సంరక్షణ కష్టం అవుతుంది
పెట్స్ అయితే మనతోపాటూ తీసుకెళ్లచ్చు
అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తాయి, మనకు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి
మరి మొక్కలను ఇలా తీసుకెళ్లలేము, ఇంట్లో వదిలి వెళ్లలేము
పైగా వేసవి కాలం ఎండలకు మనుషులే ఎండిపోతున్నారు
అందుకే సరికొత్త సాధనాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి
వీటిని సెల్ఫ్ వాటర్ గ్లోబ్స్ అంటారు. వివిధ రంగుల్లో, ఆకారాల్లో అభిస్తాయి
వీటిని ఉపయోగించే ముందు మొక్క తొట్టెను నీటితో తడపాలి
ఆతరువాత ఈ పరికరంలో నీటిని నిండుగా తీసుకోవాలి
కుండీకి ఏదో ఒక చివర మట్టి లోపలికి చొప్పించాలి
10 నుంచి 15 రోజుల వరకూ మొక్క పచ్చగా ఉంటుంది
మన హాలిడే వెకేషన్ కూడా జాయ్ ఫుల్ గా సాగుతుంది