షాంపూని నేరుగా తీసుకొని తలస్నానం చేస్తారు చాలా మంది

కొందరు షాంపూను నీళ్లలో కలుపుకొని తలంటుకుంటారు

ఇలా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు

షాంపూతో పాటూ కొన్ని సహజ పదార్థాలు కలిపి చూడండి

జుట్టు మరింత దృఢంగా మారుతుంది

రోజ్ వాటర్లో కలిపి స్నానం చేస్తే వెంట్రుకలు దురద పెట్టదు. పట్టులా మెత్తగా ఉంటాయి

ఆలీవ్ ఆయిల్ కలిపితే జుట్టు ఊడిపోకుండా మరింత ఒత్తుగా మారుతుంది

నిర్జీవంగా ఉన్న జుట్టుకు షాంపూ, నిమ్మరసం కలిపితే వెంట్రుకలు నిగనిగలాడుతాయి

కాస్త తేనె కలపడం వల్ల జుట్టు తేమగా ఉండి కురులు ఆరోగ్యకరంగా కనిపిస్తాయి