ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం.
యుగం అంటే సంవత్సరం.. ఆది అంటే ప్రారంభం
యుగం ప్రారంభమయ్యే రోజు కనుక యుగాది అయ్యింది.
ఉగాదికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంది.
తెలుగురాష్ట్రాలు, కర్ణాటకల్లో ఉగాదిగా
మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో
తమిళులు "పుత్తాండు" అని
మలయాళీలు "విషు" గా సిక్కులు "వైశాఖీ" అని బెంగాలీలు "పొయ్లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు
ఈపండుగ ప్రత్యేకత పచ్చడి. ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఆరు రుచులు ఉండేలా తయారు చేస్తారు.
జీవితంలో మంచి, చెడు, కష్టం, సుఖం, బాధ, విచారం అన్ని మిశ్రమంగా ఉంటాయని సందేశాన్ని ఇస్తుంది.
ఉగాది రోజు పంచాంగ శ్రవణం ప్రదానం
మనకు సంవత్సరం పొడవునా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకునేందుకు దోహదపడుతుంది.
నవనాయక ఫలితాలు, వాటి ప్రభావాలు, ప్రపంచంలో జరిగే వింతలు, మార్పులు, ప్రమాదాలు ముందుగా తెలుసుకొని జాగ్రత్తపడేందుకు ఉపయోగపడుతుంది.