బ్రేకింగ్‌: ఆడపిల్లలేనా మీరు ? ఇవేం బూతులు,అలేఖ్య పికిల్స్‌ మరో ఆడియో లీక్‌

ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన అలేఖ్య పికిల్స్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఓ కస్టమర్‌ అన్నందుకు వాళ్లు మాట్లాడిన భాషపై ప్రతీ ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 4, 2025 / 01:38 PM IST

ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన అలేఖ్య పికిల్స్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఓ కస్టమర్‌ అన్నందుకు వాళ్లు మాట్లాడిన భాషపై ప్రతీ ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం వాళ్ల వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌ కూడా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన అలేఖ్య సిస్టర్స్‌ కొంత కాలం క్రితం పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు. నాన్‌వెజ్‌ పచ్చళ్లు చేసి అమ్మేవాళ్లు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌, వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

రీసెంట్‌గా ఓ కస్టమర్‌ రేట్లు ఇంతలా ఎందుకు పెట్టారు అని మర్యాదగానే అడిగినా బూతులతో రెచ్చిపోయార అలేఖ్య సిస్టర్స్‌. మాటల్లో చెప్పలేని విధంగా అఫీషియల్‌ వాట్సాప్‌ నుంచే రెచ్చిపోయారు. దీంతో కస్టమర్లు వీళ్ల తీరుపై మండిపడుతున్నారు. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలో ఆ మహిళను కూడా వీళ్లు అలాగే తిట్టిన మరో ఆడియో బయటికి వచ్చింది. దీంతో వీళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ వాయిస్‌ తనది కాదంటూ తన చెల్లెల్లలో ఒకరు ఈ ఆడియో పెట్టారంటూ అలేఖ్య వీడియో పోస్ట్‌ చేసింది. తనే తిట్టి తనే నాటకాలు ఆడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీళ్ల లైసెన్స్‌ రద్దు చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేయాలని కస్టమర్లు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.