బ్రేకింగ్‌: కశ్మీర్‌ ఎటాక్‌ చేసిన టెర్రరిస్టులు వీళ్లే?

పెహల్గాంలో టూరిస్టుల మీద ఎటాక్ చేసిన టెర్రరిస్టుల స్కెచ్‌ రెడీ అయ్యింది. బాధితుల సహాయంలో ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌ రెడీ చేయించాయి భద్రతా బలగాలు.

  • Written By:
  • Updated On - April 23, 2025 / 01:14 PM IST

పెహల్గాంలో టూరిస్టుల మీద ఎటాక్ చేసిన టెర్రరిస్టుల స్కెచ్‌ రెడీ అయ్యింది. బాధితుల సహాయంలో ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌ రెడీ చేయించాయి భద్రతా బలగాలు. ఆసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌ షా, అబు తాల్హా అనే ముగ్గురు టెర్రరిస్ట్‌లు ఈ పని చేసినట్టు గుర్తించారు. ఈ దాడి చేసింది తామేనంటూ రెసిస్టెంట్స్‌ ఫ్రంట్‌ అనే ఉగ్రవాద సంస్థ ఇప్పటికే క్లెయిమ్‌ చేసుకుంది. ఈ ముగ్గురు ఈ సంస్థకు చెందిన వ్యక్తులే. ఈ ఫొటోలను పోలీసులతో పాటు మీడియాకు కూడా రిలీజ్‌ చేశాయి భద్రతా బలగాలు. స్కెచ్‌ ఆధారంగా వేట ప్రారంభించాయి. పెహల్గాం ఎటాక్‌తో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

అత్యంత దారుణంగా జరిగిన ఈ దాడిలో 28 మంది టూరిస్టులు చనిపోయారు. టూరిస్టుల పేర్లు అడిగిమీర పక్కాగా నాన్‌ ముస్లింలను టార్గెట్‌ చేసి చంపేశారు టెర్రరిస్టులు. ఇండియన్‌ ఆర్మీ జవాన్ల దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్ట్‌లు యాత్రికులను టార్గెట్‌ చేశారు. టూరిస్టులు అంతా ఉన్న ప్రాంతం మెయిన్‌ రోడ్డుకు చాలా దూరంగా ఉండటంతో ఈ దాడి విషయం చాలా ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఈ దాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల స్కెచ్‌ వేయించారు అధికారులు. టెర్రరిస్టులను లైవ్‌లో చూసినవాళ్ల సహాయంలో నిందితుల స్కెచ్‌ రెడీ చేయించారు. ఈ స్కెచ్‌ ఆధారంగా గాలింపు చేపడుతున్నారు.