కేసిరెడ్డి విచారణలో కీలక విషయాలు

ఏపీ లిక్కర్‌ స్కాంలో కేసిరెడ్డి విచారణ పూర్తైంది. నిన్న కేసిరెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు ఇవాళ ఆయనను విచారించారు. లిక్కర్‌ స్కాంకు సంబంధించి కేసిరెడ్డి నుంచి కీలక విషయాలు పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - April 22, 2025 / 06:16 PM IST

ఏపీ లిక్కర్‌ స్కాంలో కేసిరెడ్డి విచారణ పూర్తైంది. నిన్న కేసిరెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు ఇవాళ ఆయనను విచారించారు. లిక్కర్‌ స్కాంకు సంబంధించి కేసిరెడ్డి నుంచి కీలక విషయాలు పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాలతో కూడిన రిపోర్ట్‌ను పోలీసులు రెడీ చేశారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం పోలీసులు కేసిరెడ్డిని విజయవాడలోని కొత్త ఆసుప్రతికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కోర్టులో హజరుపర్చనున్నారు.

ఈ కేసులో కీలకంగా ఉన్న కేసిరెడ్డి ఇంతకాలం విదేశాల్లో ఉన్నాడు. కేసిరెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ తనను అరెస్ట్‌ చేయకుండా కోర్టు నుంచి రక్షణ వచ్చిన తరువాత తానే విచారణకు వస్తానని కేసిరెడ్డి తెలిపాడు. కోర్టు కేసిరెడ్డి పిటిషన్‌ వాయిదా పడటంతో చేసేదేం లేక విచారణకు వచ్చేందుకు ఒప్పుకున్నాడు కేసిరెడ్డి. కానీ విచారణకు రాకముందే హైదరాబాద్‌లో దిగిన వెంటనే కేసిరెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇవాళ విచారణ పూర్తి చేసి కోర్టులో హాజరుపర్చారు.