వివేకా కేసుపై విజయసాయి సంచలన కామెంట్స్

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణంపై వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యాను అన్నారు. వెంటనే అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి అడిగానని తెలిపారు.

  • Written By:
  • Publish Date - January 25, 2025 / 01:08 PM IST

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణంపై వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యాను అన్నారు. వెంటనే అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి అడిగానని తెలిపారు. అవినాష్‌ మరో వ్యక్తికి ఫోన్‌ ఇచ్చారని గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని వివరించారు. ఫోన్‌లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పాను అన్నారు.

తాను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని స్పష్టం చేసారు. అప్రూవర్ గా మారాలని తనపై ఒత్తిడి చేసినా సరే మారలేదు అన్నారు విజయసాయి. లండన్ లో ఉన్న జగన్ తో అన్ని విషయాలు మాట్లాడినట్టు తెలిపారు. జగన్తోా మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశాను అన్నారు. ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదన్నారు.