బ్యాట్ తో తలను కొట్టుకున్నాడు, వార్నర్ కు వింత అనుభవం

బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడుతున్న ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు వింత అనుభవం ఎదురైంది. సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌.. హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు.

  • Written By:
  • Publish Date - January 11, 2025 / 08:47 PM IST

బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడుతున్న ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు వింత అనుభవం ఎదురైంది. సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌.. హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు. మెరిడిత్‌ బౌలింగ్ లో వార్నర్‌ మిడ్‌ ఆఫ్‌ దిశగా డ్రైవ్‌ చేశాడు. బౌలర్‌ స్పీడ్‌ ధాటికి డ్రైవ్‌ షాట్‌ ఆడగానే వార్నర్‌ బ్యాట్‌ హ్యాండిల్‌ దగ్గర విరిగిపోయింది. క్రికెట్‌లో ఇలా జరగడం సాధారణమే. ఇక్కడే ఓ ట్విస్ట్‌ నెలకొంది. బ్యాట్‌ విరగగానే రెండో భాగం కాస్త వార్నర్‌ తల వెనుక గట్టిగా తగిలింది. అదృష్టవశాత్తు హెల్మెట్‌ ధరించినందుకు వార్నర్‌కు ఏమీ కాలేదు. ఇలా జరగ్గానే వార్నర్‌ గట్టి అరిచాడు. కామెంటేటర్లు సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.