వెస్టిండీస్ కు షాక్, బంగ్లాదేశ్ సంచలనం

టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ మరోసారి సంచలన ప్రదర్శన కనబరిచింది. సొంతగడ్డపై కరేబియన్ టీమ్ కు షాకిచ్చింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 05:45 PM IST

టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ మరోసారి సంచలన ప్రదర్శన కనబరిచింది. సొంతగడ్డపై కరేబియన్ టీమ్ కు షాకిచ్చింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌ను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా కరేబియన్‌ గడ్డపై పదిహేనేళ్లలో తొలి టెస్టు విజయాన్ని రుచి చేసింది. అంతేకాదు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది. బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్‌ అయింది. తర్వాత విండీస్ 146 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ లో బంగ్లాదేశ్‌ 268 పరుగులు చేయగా.. ఛేజింగ్ లో విండీస్ చేతులెత్తేసింది. .
బంగ్లా బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో 185 పరుగులకే వెస్టిండీస్‌ ఆలౌటైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-1తో సమంగా ముగిసింది.