బ్రేకింగ్: చంద్రబాబుకు గుడ్ న్యూస్

టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీం కోర్ట్ లో బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం డిస్మిస్ చేసింది.

  • Written By:
  • Publish Date - January 15, 2025 / 02:22 PM IST

టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీం కోర్ట్ లో బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. చార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ బేలా త్రివేది తెలిపారు.

2023 నవంబర్‌లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ను రద్దు చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.