బ్రేకింగ్‌:మా సరితమ్మను స్టేజ్‌ మీదకు పిలవరా, పొంగులేటిని చుట్టుముట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

గద్వాలలో నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక నేత సరితా తిరుపతయ్యను స్టేజ్‌ మీదకు పిలవలేదంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

  • Written By:
  • Updated On - April 19, 2025 / 03:10 PM IST

గద్వాలలో నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక నేత సరితా తిరుపతయ్యను స్టేజ్‌ మీదకు పిలవలేదంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు ఎంపీ మల్లు రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్థానిక కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ సరిత తిరుపతయ్యను స్టేజ్‌ మీదకు పిలవకుండా కార్యక్రమం నిర్వహించారంటూ ఆమె తరపు కార్యకర్తల వర్గం ఆందోళన చేశారు. లోకల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహణ్‌ మాట్లాడుతుండగా అడ్డుకున్నారు. కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఎంపీ మల్లు రవిపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు వాళ్లపై లాఠీ ఛార్జ్‌ చేసి అక్కడి నుంచి పంపించేశారు.