ఏం పీ… పీక్కోండి: ఫాంలోకి వచ్చిన అనీల్

ఆంధ్రప్రదేశ్ లో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.

  • Written By:
  • Publish Date - November 20, 2024 / 05:05 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో దీనిపై అనీల్ కుమార్ యాదవ్ స్పందించారు. పార్టీ మార్పుపై ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అనీల్… ఇప్పుడు మాట్లాడుతూ… రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌ వెంటే ఉంటా అని స్పష్టం చేసారు.

వ్యక్తిగత కారణాలతో కొంతకాలం దూరంగా ఉన్నా అని తెలిపిన ఆయన త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొంటా అని స్పష్టం చేసారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి.. భరిస్తానన్న అనీల్… అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా అని హెచ్చరించారు. నాన్‌స్టాప్‌ కార్యక్రమాలు చేపడతా అని ధీమా వ్యక్తం చేసారు.