ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ఓటర్ల ముందుకు

తెలంగాణలో పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

  • Written By:
  • Publish Date - February 19, 2025 / 01:55 PM IST

తెలంగాణలో పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. ఎన్నికల బరి నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకోవడంతో…కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడు పెంచారు. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి…ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు మేనిఫెస్టోను రిలీజ్‌ చేశారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన పట్టభద్రుల సంకల్పయాత్రకు…బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. 5జీ కాలంలో కాంగ్రెస్‌ 3జీకి పరిమితమైందంటూ సెటైర్లు వేశారు. నాలుగు జిల్లాల్లోనూ చిన్నమైల్ అంజిరెడ్డికి…పట్టభద్రుల నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో గెలుస్తాననే ధీమాలో ఉన్నారు చిన్నమైల్ అంజిరెడ్డి.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి…ప్రత్యేకంగా ఎన్నిలక మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నానని…విద్యార్థులు, ఉద్యోగులకు చేయూత ఇస్తానని హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి-ఉద్యోగ అవకాశాల కల్పన, ఉద్యోగ భద్రత-నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ల సంక్షేమం, భద్రతకుకు పెద్దపీట వేస్తానని.. ప్రతి పట్టభద్రుడి సామాజిక భద్రతకు హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగుల హక్కులకై పోరాటం.. సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని…వారి సంక్షేమం, అభ్యున్నతికి ప్రోత్సాహం అందిస్తానన్నారు. వైద్య రంగ అభివృద్ధికి…డాక్టర్ల సంక్షేమం లాంటి అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఎన్నికైన వెంటనే 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. మేనిఫెస్టో అమలు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజావేదిక నిర్వహణ అంటూ హామీ ఇచ్చారు.