బ్రేకింగ్: ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరిక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

  • Written By:
  • Publish Date - January 8, 2025 / 01:54 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. జాతీయ విద్యావిధానం ఆధారంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు తొలగిస్తామని స్పష్టం చేసారు.

ఇంటర్ మొదటి సంవత్సరానికి ఇంటర్నల్ పరీక్షలు మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై ఈ నెల 26లోపు సలహాలు స్వీకరిస్తామన్న ఆయన… వెబ్ సైట్ లో అభిప్రాయాలు చెప్పవచ్చని అన్నారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు యథావిథిగా ఉంటాయని తెలిపారు. అలాగే సిలబస్ కూడా భారీగా తగ్గిస్తామని.. విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా చూస్తామని పేర్కొన్నారు.