TS INTER EXAMS: ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం
తెలంగాణ విద్యా శాఖ, ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి.