టెర్రరిస్టుల వేట మొదలు, సీన్‌లోకి అజిత్‌ దోవల్‌ ఎంట్రీ

పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అధికారులతో భేటీ అయ్యారు.

  • Written By:
  • Publish Date - April 23, 2025 / 03:03 PM IST

పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అధికారులతో భేటీ అయ్యారు. ఈ దాడిలో ముగ్గురు టెర్రరిస్టులు కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే భద్రతా దళాలు నిర్ధారించాయి. ఆ ముగ్గురు వ్యక్తుల ఫొటోలను కూడా రిలీజ్‌ చేశాయి. దీంతో ఇప్పుడు ఆ ముగ్గురుతో పాటు వాళ్ల దళాలను వేటాడే పడింది ఇండియన్‌ ఆర్మీ.

ప్రధాని మోడీ కూడా తన సౌదీ పర్యటన ముగించుకుని ఇండియాకు చేరుకున్నారు. వచ్చీ రాగానే పహల్గాం ఎటాక్‌పై సమావేశానికి ఆదేశించారు. ఈ ఎటాక్‌ వెనక పెద్ద మాస్టర్‌ మైండ్‌ ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. టూరిస్టులు బస చేసిన హోటల్స్‌ నుండే డేటా లీకైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు. హోటల్స్‌ నుంచి సమాచారం తీసుకుని చాలా ప్లాన్డ్‌గా టెర్రరిస్టులు టూరిస్టులను ఎటాక్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి హోటల్స్‌ లిస్ట్‌ను రెడీ చేశారు అధికారులు. ఆ హోటల్స్‌ యజమానులను విచారించబోతున్నారు. వీళ్ల విచారణ తరువాత కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.