బ్రేకింగ్:పహల్గాం ఉగ్రదాడి రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌ ,ఎటాక్‌ చేసింది ఆ నలుగురే

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో NIA చేతికి కీలక వీడియో అందినట్లు తెలుస్తోంది. దాడి జరిగినప్నపుడు అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఉగ్రదాడి మొత్తాన్ని వీడియో తీసినట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - April 28, 2025 / 05:21 PM IST

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో NIA చేతికి కీలక వీడియో అందినట్లు తెలుస్తోంది. దాడి జరిగినప్నపుడు అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఉగ్రదాడి మొత్తాన్ని వీడియో తీసినట్టు సమాచారం. ఈ వీడియో ద్వారా మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. నలుగురు ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి పర్యాటకుల మీద దాడి చేసినట్టు నిర్ధారించారు. వీళ్లలో ఒకడు స్థానిక ఉగ్రవాది అయిన ఆదిల్‌గా అనుమానిస్తున్నారు.

ఆదిల్‌ మొదట మిజ్బుల్‌ ముజాయిదీన్‌ అనే ఉగ్రవాద సంస్థ కోసం పని చేసేవాడు. తరువాత లష్కరే తోయిబాలో ట్రైనింగ్‌ తీసుకుని కశ్మీర్‌కు వచ్చేశాడు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు గైడ్‌గా పని చేస్తూ ఇలాంటి ఎటాక్స్‌లో వాళ్లకు సహరిస్తూ నివాసం ఏర్పాటు చేసేవాడని NIA గుర్తించింది. ఇక ఘటనా స్థంలో ఏకే-47, ఎమ్‌-4 రైఫిల్స్‌ ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులు చాలా కాలంగా ఎమ్‌-4 రైఫిల్స్‌నే ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ దాడి ఎవరు చేశారు అనే విషయంలో NIAకు క్లారిటీ వచ్చింది. ఈ నగులుర్ని పట్టుకునేందుకు భారత జవాన్లు వేట మొదలు పెట్టారు.