మొన్న వైజాగ్ కు మోడీ.. రేపు బెజవాడకు అమిత్ షా…!

ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - January 16, 2025 / 06:30 PM IST

ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు.

ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేయగా అక్కడి నుంచి అనంతరం విజయవాడలోని హోటల్లో ఆ రోజు రాత్రి బస చేస్తారు. 19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను అమిత్ షా ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు