తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు, బంగ్లా మాజీ కెప్టెన్ పరిస్థితి విషమం

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. స్వల్ప వ్యవధిలో అతడికి రెండు సార్లు గుండె పోటు రావడంతో పరిస్థితి విషమించింది.

  • Written By:
  • Publish Date - March 24, 2025 / 05:24 PM IST

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. స్వల్ప వ్యవధిలో అతడికి రెండు సార్లు గుండె పోటు రావడంతో పరిస్థితి విషమించింది. ఢాకా ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఆడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు తమీమ్ బంగ్లా తరఫున 70 టెస్టులు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 243 వన్డే మ్యాచ్‌లు ఆడి 8,357 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో తమీమ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.