వేరే అమ్మాయితో దొరికాడు.. స్మృతి మాజీ లవర్ పై నిర్మాత కామెంట్స్

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - January 24, 2026 / 09:00 PM IST

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని.. లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌తో నవంబరు 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దైనట్లు స్మృతి- పలాష్‌ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు. కాగా తనతో ప్రైవేట్‌గా చాట్‌ చేశాడంటూ పలాష్‌ ముచ్చల్‌ గురించి ఓ మహిళ సోషల్‌ మీడియాలో స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసింది.

అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్‌ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులూ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకొంటున్న నటుడు- నిర్మాత విద్యాన్‌ మానే వ్యాఖ్యలు చేశాడు. ఆరోజు స్మృతి పెళ్లి వేడుకల్లో తాను ఉన్నాననీ,. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడనీ చెప్పుకొచ్చాడు. అప్పుడు స్మృతి సహచర క్రికెటర్లు అతడిని కొట్టారన్నాడు. ముచ్చల్‌ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారేననీ వ్యాజ్యానించాడు.

కాగా ఫిలిం ఫైనాన్సర్‌గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్‌.. నజరియా అనే సినిమా తీస్తున్నానని.. ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్‌ మానే ఈ సందర్భంగా తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని.. అయితే, సినిమా పనులు మొదలుకాకపోగా.. ఆ తర్వాత పలాష్‌ ఫోన్‌ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు.ఈ క్రమంలోనే అతడిపై చీటింగ్‌ కేసు పెట్టినట్లు వెల్లడించాడు. అయితే, పలాష్‌ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్‌ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. పెళ్లి రద్దు తర్వాత స్మృతి ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది .