సొట్టబుగ్గల పాప కౌగిట్లో చాహల్, సీన్ అదిరిందంటున్న ఫ్యాన్స్

ఐపీఎల్ మొన్నటి వరకూ హైస్కోరింగ్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన అభిమానులకు పంజాబ్ , కోల్ కత్తా పోరు ఊహించని షాక్ ఇచ్చింది. లో స్కోరింగ్ నమోదవడమే కాదు చివరి వరకూ ఉత్కంఠతో ఊపేసింది.

  • Written By:
  • Publish Date - April 16, 2025 / 11:45 AM IST

ఐపీఎల్ మొన్నటి వరకూ హైస్కోరింగ్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన అభిమానులకు పంజాబ్ , కోల్ కత్తా పోరు ఊహించని షాక్ ఇచ్చింది. లో స్కోరింగ్ నమోదవడమే కాదు చివరి వరకూ ఉత్కంఠతో ఊపేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పరుగుల తేడాతో ఓటమిపాలయింది. యుజ్వేంద్ర చాహల్ స్పిన్ మ్యాజిక్‌తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఈజీ విక్టరీ సాధిస్తుంది అనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. పంజాబ్ కింగ్స్ అందించిన 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది.అయితే కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి ఇంపాక్ట్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ తన స్పెషల్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

అజింక్య రహానే‌ను అవుట్ చేసిన యుజ్వేంద్ర చాహల్ ఆ తర్వాత వరుస వికెట్లతో పంజాబ్ గెలుపులో కీలకంగా మారాడు. రహానే, రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్‌ను చాహల్ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. వెంకటేశ్ అయ్యర్‌ను మ్యాక్స్‌వెల్ అవుట్ చేయగా, హర్షిత్ రాణాను మార్కో యాన్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 62 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 17 పరుగుల తేడాతోనే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో ఆండ్రీ రసెల్ పోరాడినప్పటికీ కేకేఆర్ ఓటమి తప్పలేదు.16వ ఓవర్ మొదటి బంతికి మార్కో యాన్సన్ ఆండ్రీ రసెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కేకేఆర్ 15.1 ఓవర్‌కు 95 పరుగులకే ఆలౌట్ అయింది.

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. అయితే ఈ సంచలన విజయానికి పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ చాహల్‌ ప్రధాన కారణం.తన స్పెల్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన చాహల్ 4 కీలక వికెట్లు తీసి పంజాబ్ ను గెలిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టాండ్స్‌లో ఎగురుతూ, గంతులేస్తూ, కేరంతలు కొడుతూ తెగ సంతోషపడిపోయింది. ఈ క్రమంలోనే పంజాబ్‌ విజయంలో కీలకంగా వ్యవహరించిన చాహల్‌ను గట్టిగా హత్తుకుని అభినందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొట్టబుగ్గల పాప కౌగిట్లో చాహల్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.