బ్రేకింగ్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల, స్టేట్‌ టాపర్‌ ఎవరంటే…!

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యుటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్న ప్రభాకర్‌ ఫలితాలను విడుదల చేశారు.

  • Written By:
  • Publish Date - April 22, 2025 / 03:15 PM IST

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యుటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్న ప్రభాకర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణ సాధించారు విద్యార్థులు. ఇక సెకండ్‌ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌ బాయ్స్‌లో 57.83 శాతం ఉత్తీర్ణత, గర్ల్స్‌లో 73.83 శాతం ఉత్తీర్ణత వచ్చింది.

ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 4 లక్షల 88 వేల 430 కాగా సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 5 లక్షల 8 వేల 582 మంది. ఇక సెకండ్‌ ఇయర్‌లో ఉత్తీర్ణత 57.83 శాతం కాగా గర్ల్స్‌ ఉత్తీర్ణత 74.21 శాతం. పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు.