బంగారం ,వెండి కొంటూనే ఉంటా రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రైటర్‌ షాకింగ్‌ పోస్ట్‌…!

రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్ పుస్తకం రచయిత రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది. బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీల ధరలు పెరిగినా.

  • Written By:
  • Updated On - January 24, 2026 / 09:20 PM IST

రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్ పుస్తకం రచయిత రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది. బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీల ధరలు పెరిగినా. తగ్గినా తనకు పట్టింపులేదని, కొంటూనే ఉంటానని తెలిపారు రాబర్ట్‌. ‘నేను ధరలు పెరిగినా తగ్గినా పట్టించుకోను. నేను ఎప్పుడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం కొంటూనే ఉంటాను. అందుకే నేను రిచ్ అవుతున్నాను’ అని పోస్ట్ చేశారు రాబర్ట్. అమెరికా అప్పు రోజురోజుకూ పెరుగుతోంది. డాలర్ విలువ తగ్గిపోతోంది. పేపర్ మనీ వల్ల సేవింగ్స్ ఎప్పుడూ నష్టపోతాయి. కాబట్టి రియల్ అసెట్స్ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలనేది రాబర్ట్ కియోసాకి వాదన.’బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం ధరల గురించి ఎందుకు ఆలోచించాలి ?

ప్రపంచాన్ని నడిపే అమెరికా ఫెడరల్ రిజర్వ్, ట్రెజరీ, ప్రభుత్వంలో ఉన్నవారు, హైలీ ఎడ్యుకేటెడ్ PhD హోల్డర్లు. నా పూర్ డ్యాడ్ లాంటి అనర్హులు. వాళ్లు డబ్బు ప్రింట్ చేసి రుణాలు తీసుకుంటున్నారు. దాని వల్ల డాలర్ విలువ తగ్గుతోంది. అందుకే నేను రియల్ అసెట్స్ కొంటున్నాను.’ అని కొత్త ఫిలాసఫీ చెప్పారు రాబర్ట్‌. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. వెండి ధర మొదటిసారి ఔన్సుకు 100 డాలర్లు దాటి 102.87 వరకు పెరిగింది. ఒక్క రోజులో 6.9 శాతం పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతానికిపైగా పైగా పెరిగింది. 2025లో అయితే వెండి ధర రెట్టింపు అయ్యింది. మరోవైపు బంగారం కూడా రికార్డు స్థాయిలో ఉంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్సు ధర 4 వేల 981.52 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వారం 8 శాతానికిపైగా ధర పెరిగింది. 2020 మార్చి తర్వాత అత్యధిక వీక్లీ గెయిన్ ఇదే. త్వరలోనే గోల్డ్‌ ధర 5 వేల డాలర్ల మైలురాయికి దగ్గర్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాబర్ట్‌ చేసిన విశ్లేషణ వంద శాతం కరెక్ట్‌ అంటున్నారు నిపుణులు.