మెదక్ జిల్లా మనోహరాబాద్ కాళ్లకల్‌లో ఓ ప్రేమ జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పోలీసుల జీపులో ఉన్న జంటను బయటికి లాగి మరీ అబ్బాయి మీద దాడి చేసి అమ్మాయిని తమతో తీసుకెళ్లారు. మనోహరాబాద్ మండలం కోయినాపల్లికి చెందిన నాయినాథ్ సిద్ధిపేట్ జిల్లా కొత్తూరుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. రీసెంట్‌గానే యువతి నుంచి ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం తమకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వాళ్లను మేడ్చల్ తీసుకెళ్తుండగా కాళ్లకల్ వద్ద పోలీస్ జీపును అమ్మాయి తరఫు బంధువులు అడ్డుకున్నారు. జీపులో నుంచి జంటను బయటికి లాగి యువకుడి మీద దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే బలవంతంగా అమ్మాయిని తమతో తీసుకువెళ్లారు. తన భార్య తనకు కావాలంటూ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.