భర్తను చంపి, శవం పక్కన పడుకుని పో**ర్న్‌ వీడియోలు…

యావత్‌ మహిళా ప్రపంచం తల దించుకునే ఘటన ఇది. లవర్‌తో కలిసి భర్తను చంపి.. భర్త శవం పక్కన పడుకుని రాత్రంతా పోర్న్‌ వీడియోలు చూసింది ఓ మహిళామణి

  • Written By:
  • Publish Date - January 22, 2026 / 07:00 PM IST

యావత్‌ మహిళా ప్రపంచం తల దించుకునే ఘటన ఇది. లవర్‌తో కలిసి భర్తను చంపి.. భర్త శవం పక్కన పడుకుని రాత్రంతా పోర్న్‌ వీడియోలు చూసింది ఓ మహిళామణి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరులో జరిగింది ఈ ఘటన. శివనాగరాజు లక్ష్మీమాధురికి 2007లో పెళ్లి జరిగింది. విజయవాడలోని ఓ థియేటర్‌లో లక్ష్మీ పని చేస్తోంది. అక్కడే సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. లవర్‌తో కలిసి బతికేందుకు భర్తను అడ్డు తొలగించుకోవాలని అతన్ని చంపేందుకు ప్లాన్‌ చేసింది.

ఈ నెల 18న శివనాగరాజు రాత్రి ఇంటికి వచ్చిన తరువాత ప్రేమ నటిస్తూ అతనికి బిర్యానీ పెట్టింది. ఆ బిర్యానీలో దాదాపు 20 నిద్రమాత్రలు కలిపింది. అది తిని శివనాగరాజుకు గాఢ నిద్రలోకి జారుకున్నాక.. లవర్‌తో కలిసి భర్తకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. లవర్‌తో ఏకాంతంగా గడిపి అతను వెళ్లిపోయిన తరువాత సిగ్గు లేకుండా భర్త శవం పక్కన పడుకుని రాత్రంతా పోర్న్‌ వీడియోలు చూసింది. ఉదయాన్నే భర్త చనిపోయాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

నిద్రలో హార్ట్‌ ఎటాక్‌ రావడంతో అతను చనిపోయి ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ శివనాగరాజు చెవిలో నుంచి రక్తం రావడం చూసి అతని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాడీని పోస్ట్‌మార్టంకు తరలించడంతో నిద్రమాత్రలు తీసుకున్నట్టు తేలింది. ఎందుకు నిద్ర మాత్రలు తీసుకున్నాడని లక్ష్మీని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పింది. అనుమానంతో ఆమెను అరెస్ట్‌  చేసి విచారిస్తే మొత్తం విషయం బయటికి వచ్చింది. ఆమె ఫోన్‌ పరిశీలించడంతో రాత్రి తాను చేసిన దిక్కుమాలని వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది.