Home » Entertainment » Some Rare Photos In The Life Of Tollywood Famous Hero Actor Chandramohan
Chandramohan RIP : వెండితెర చంద్రం ఇక లేరు..
టాలీవుడ్ ప్రముఖ హీరో నటుడు ( మల్లంపల్లి చంద్రశేఖర రావు ) చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు.
అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు.
మల్లంపల్లి చంద్రశేఖర్ రావు 1942, మే 23న కృష్ణా జిల్లాలో జన్మించారు.
2 / 26
ఈయన బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ లో డిగ్రీ పూర్తిచేశారు.
3 / 26
కళాతపస్వి దర్శకుడు కె విశ్వనాథ్ కి బంధువు అవుతాడు.
4 / 26
వీరిద్దరి కలయికలో వచ్చిన సిరిసిరి మువ్వ చిత్రం మంచి విజయం సాధించి ఇద్దరికి గొప్పపేరు వచ్చింది.
5 / 26
చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు.
6 / 26
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న చంద్రమోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
7 / 26
వెండితెక చంద్రం ఇక లేరు
8 / 26
హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయా విలన్.. కమెడియన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు చంద్ర మోహన్.
9 / 26
అప్పట్లో చంద్రమోహాన్ ది లక్కి హ్యాండ్ అని తనతో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ కు తరువాత మంచి అవకాశాలు వచ్చి తారా స్థాయికి వెళ్లేవారు.
10 / 26
కెరియర్ మొదట్లో కొత్త నీరు చిత్రంలో సీరియస్ గా నటించిన ఆయన తర్వాత కామెడీ హీరోగా మారారు.
11 / 26
ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
12 / 26
శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి ఇలా ఎంతో మంది హీరోయిన్లు మొదట ఆయన సరసన నటించిన తరువాతే వారికి స్టార్ డమ్ వచ్చింది.
13 / 26
బంగారు పిచుక సినిమాలో చంద్రమోహన్ నటనకు అప్పట్లో చాలా మంచి పేరు వచ్చింది.
14 / 26
అలా సినిమాలో హీరో అయితేనే చేస్తా అని కాకుండా క్యారెక్టర్ నచ్చితే చేసేలా అలవరుచుకున్నాడు.
15 / 26
అలా ఇప్పటి వరకు 932 సినిమాల్లో నటించారు. అందులో 175 చిత్రాల్లో కథానాయకుడిగా నటించడం విశేషం
16 / 26
అలా అల్లుడు గారు సినిమాతో తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు.
17 / 26
అటు తరువాత గులాబీ, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా అద్భుతమైన ప్రదర్శనను చూపించారు.
18 / 26
ఇక కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు వచ్చింది.
యంగ్ హీరోలకే కాదు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు కూడా ఆయన ఫాదర్ గా నటించి మెప్పించారు.
19 / 26
హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయా విలన్.. కమెడియన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు చంద్ర మోహన్.
20 / 26
చంద్రమోహన్ కు ముందు చూపు వలన అప్పట్లో సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం ల్యాండ్ బిజినెస్ ల మీద పెట్టుబడి పెట్టి ఆయనకు సినిమాలు లేని టైమ్ లో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్భందిగా ప్లాన్ చేసుకున్నారు.
21 / 26
ఆ తరువాతి నటులు అయిన ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అలా మొత్తం 55 ఏళ్ల తన నటన జీవితంలో చాలా విజయాలను చూశారు.
22 / 26
ప్రస్తుతం మనువళ్లు, మనువరాళ్లతో సమయం గడుపుతున్న చంద్రమోహాన్ కు ఇద్దరు కుమార్తేలు.
23 / 26
చంద్రమోహన్ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
24 / 26
సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
25 / 26
చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు.
26 / 26
అందరూ జీవితంలో సెటిల్ అయ్యారు. తెలుగు తెరపై చందమామలాగా వెలిగిపోయిన చంద్రమోహన్ ఇక లేరన్న చేదువార్త అందరిని కలిచి వేస్తుంది.