న్యూజిలాండ్ కు ఐసీసీ షాక్, డబ్ల్యూటీసీ పాయింట్లలో పెనాల్టీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ కు ఐసీసీ షాకిచ్చింది. ఇంగ్లాండ్ తో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది.

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 07:48 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ కు ఐసీసీ షాకిచ్చింది. ఇంగ్లాండ్ తో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి. ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టం లేదు.. కానీ న్యూజిలాండ్‌కు మాత్రం పెద్ద దెబ్బేనని చెప్పాలి. కివీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు క్లిష్టంగా మారాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచింది.
న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. తర్వాత రెండు మ్యాచ్ లు గెలిచినా గెలుపు శాతం 55 దాటదు.