కేశవ్ మహరాజ్ స్పిన్ మ్యాజిక్, లంకపై సౌతాఫ్రికా ఘనవిజయం

సొంతగడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 రన్స్ కే ఆలౌటైంది.

  • Written By:
  • Publish Date - December 9, 2024 / 07:59 PM IST

సొంతగడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 రన్స్ కే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 358 పరుగులు చేయగా.. శ్రీలంక 328 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 317 పరుగులు చేసి ఆలౌటై లంక ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఐదోరోజు 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ధాటికి చేతులెత్తేసింది. ఈ సఫారీ స్పిన్నర్ 5 వికెట్లతు లంకను దెబ్బకొట్టాడు. డేన్ పీటర్‌సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గానూ, బవుమా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచారు.