పెర్త్ టూ జెడ్డా టూ పెర్త్, వేలం కోసం వెటోరీ ప్లాన్

ఆ్రస్టేలియా క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ డానియెల్‌ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడనున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ మెగావేలంలో పాల్గొనేందుకు జెడ్డా వెళుతున్నాడు.

  • Written By:
  • Publish Date - November 19, 2024 / 09:33 PM IST

ఆ్రస్టేలియా క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ డానియెల్‌ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడనున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ మెగావేలంలో పాల్గొనేందుకు జెడ్డా వెళుతున్నాడు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ ఆసీస్ జట్టుతో కలుస్తాడు. బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ జరుగుతుండగానే మెగా వేలం కూడా ఉండడంతో వెటోరీ ఆసీస్ జట్టును వీడి వెళ్ళాల్సి వస్తోంది. వెటోరీ రిక్వెస్టును ఆసీస్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. సీఏ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కోచ్‌ లాచ్లన్‌ స్టీవెన్స్‌… తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని ఆసీస్ బోర్డు తెలిపింది.