ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ధామ్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 29, 2025 / 12:49 PM IST

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ధామ్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30 నుండి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతోంది. దీని కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అదే సమయంలో కేదార్‌నాథ్ ఆలయంలో కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని మే 2న తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న తెరుచుకుంటాయి. దీనికి ముందు, ఆలయాన్ని 8క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ధామ్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది.

కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. చార్ ధామ్ యాత్ర అంటే భక్తులలో కూడా ఉత్సాహం ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని సన్నాహాలను బలోపేతం చేయడంలో బిజీగా ఉంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు. ఈ సారి కూడా భక్తుల అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉండటంతో ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అక్కడి ప్రభుత్వం.