రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి ?

అమృత తన పేరు పక్కన ప్రణయ్ పేరు తీసేస్తే తప్పేంటి. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడినప్పటినుంచి అమృత మళ్లీ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది.

  • Written By:
  • Publish Date - March 14, 2025 / 01:50 PM IST

అమృత తన పేరు పక్కన ప్రణయ్ పేరు తీసేస్తే తప్పేంటి. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడినప్పటినుంచి అమృత మళ్లీ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది. మొదట్లో అమృత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరు అమృత ప్రణయ్ అని ఉండేది. రీసెంట్‌గా అమృత.. ఆ పేరును మార్చి ప్రణయ్ పేరు తీసేసి అమృత వర్షిని అని పెట్టుకు. దీంతో ఆమె ప్రణయ్‌ని మర్చిపోయింది.. రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఈ చర్చ పెట్టేవాళ్లంతా ఒక మాట చెప్పండి. ఆమె ప్రొఫైల్ పేరు మార్చుకుంటే తప్పేంటి.. పేరు కాదు.. అసలు ఆమె రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి. ప్రణయ్ చనిపోయిన తర్వాత చాలా కాలం అమృత అదే డిప్రెషన్లో ఉంది. ఆమె డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆమె గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలి అని చాలా మంది మాట్లాడారు.

ఇప్పుడు ఆమె అదే పని చేస్తుంటే మళ్లీ తప్పు చేస్తుంది అన్నట్టు పోస్టులు పెడుతున్నారు. ఇదేం లాజిక్‌ ? ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు అవసరం. ప్రతి అమ్మాయి జీవితంలో ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యం కన్నతండ్రి.. కట్టుకున్న భర్త. కానీ అమృత విషయంలో ఆ ఇద్దరు ఇప్పుడు లేరు ప్రణయ్ చనిపోయి దాదాపు ఏడేళ్లు అవుతుంది. ఇప్పుడు అమృత ఇంకో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తే తప్పేంటి. ఆమె అలాగే పెళ్లి చేసుకోకుండా ఉంటే చనిపోయిన ప్రణయ్ తిరిగి రాదు కదా. అమృత కొడుక్కి తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తారు ?

ఎవరు అవునన్నా కాదన్నా తన తల్లి బాధ్యత, తన కొడుకు బాధ్యత చూసుకోవాల్సింది అమృతే. ఇన్ని బాధ్యతలు మధ్య ఖచ్చితంగా ఆమెకు ఒక తోడు అవసరం. పెళ్లి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం. అమృత రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇండియాకు ఉన్న అప్పులేం తీరిపోవు.. అమృత రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే POK సమస్య సాల్వ్ ఐపోదు… సో అమృత పేరు మార్చుకుంది.. అమృత రెండో పెళ్లి చేసుకుంటుంది అనే సోది కంటే.. ఏవైనా పనికొచ్చే పోస్టులు చేస్తే బెటర్. అంటున్నారు అమృత సపోర్టర్స్‌. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.