ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుస్తాయని,ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం,శోచనీయం, ఆక్షేపనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా జ్ఞానోదయం కలగకపోవడంగర్హనీయమన్నారు. కక్ష రాజకీయాల వల్లనే గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోరంగా పరాజయం పాలైంది.150 యొక్క స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఇప్పటికే జ్ఞానోదయం కలగ కుండా మళ్ళీ అవే మాటలు మాట్లాడడం కక్ష రాజకీయాలు ఉంటాయని చెప్పడం సెల్ఫ్ గోలు కొట్టుకోవడం తప్ప మరేమీ కాదని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు పోతాను, లేకుంటే పోను అని చెప్పడం అవివేకం,అజ్ఞానం అన్నారు.పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నది ప్రతిపక్ష నేతగా కాదు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ అఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.అంటే శాసనసభ్యుడు శాసనసభకు పోయి ప్రజా సమస్యల మీద మాట్లాడం శాసనసభ్యుని బాధ్యత.బాధ్యతను విస్మరించి శాసనసభకుపోను అనడం ప్రజాభిప్రాయాన్ని మన్నించకపోవడం అవుతుంది.ప్రతిపక్ష నేత హోదా రావాలంటే అసెంబ్లీ నియమ నిబంధనలు, సాంప్రదాయాలు ఉన్నాయి.మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 10%,అంతకంటే ఎక్కువగా శాసనసభ్యులు ఉన్న పార్టీకి, ఏ పార్టీ పెద్దదైతే ఆ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల సంఖ్య 175. ఇందులో 10 శాతం అంటే 18 మంది ఉండాలి . వైకాపా పార్టీకి 11 మంది ఉన్నారు. ఏడు మంది తక్కువ ఉన్నారు.కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు.ఇది తెలిసి కూడా అలా మాట్లాడడం మూర్ఖత్వం.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతల 94 లో కాంగ్రెస్ పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 294.అందులో పది శాతం అంటే 29 మంది. 1994 లో కాంగ్రెస్ తరుపున 26 మంది గెలిచారు.ముగ్గురు తక్కువ ఉన్నారు.అందువల్ల ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆనాడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా మాత్రమే ఉన్నారు.
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అయినప్పటికీ సమర్థవంతంగా పనిచేసే శభాష్ అనిపించుకున్నారు లోక్సభ సభ్యుల సంఖ్య 543. అందులో 10 శాతం అంటే 54 మంది కావాలి . కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 మంది,2019లో 52 మంది ఎంపీలు గెలిచారు 54 మంది లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని కారణంగా జగన్మోహన్ రెడ్డి శాసనసభకు పోలేదు అనుకున్నా మరి మిగతా పదిమంది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు ఎందుకు పోవడం లేదు?ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి తో సహా ఆ పార్టీకి చెందిన 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి పోవాలని, కక్ష రాజకీయాలకు ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తులసి రెడ్డి సూచించారు.