గంటా సంచలన ట్వీట్…!

విశాఖ నుంచి అమరావతి చేరుకోవడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన ట్వీట్ చేసారు.

  • Written By:
  • Publish Date - April 15, 2025 / 04:45 PM IST

విశాఖ నుంచి అమరావతి చేరుకోవడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని పోస్ట్ చేసారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ ట్వీట్ చేసారు.pic.twitter.com/kDMWFyjs9I

— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025