తెలుగుకు బదులు హిందీ పేపర్‌, టెన్త్‌ పరీక్షల్లో నిర్లక్ష్యం…!

తెలంగాణ టెన్త్‌ ఎగ్జామ్స్‌ మొదలైన మొదటి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మంచిర్యాలలో విద్యార్థులకు తెలుగు పేపర్‌కు బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు సిబ్బంది. ఎగ్జామ్‌ పేపర్‌ చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

  • Written By:
  • Publish Date - March 21, 2025 / 04:38 PM IST

తెలంగాణ టెన్త్‌ ఎగ్జామ్స్‌ మొదలైన మొదటి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మంచిర్యాలలో విద్యార్థులకు తెలుగు పేపర్‌కు బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు సిబ్బంది. ఎగ్జామ్‌ పేపర్‌ చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దాదాపు గంట తరువాత జరిగిన తప్పిదాన్ని గుర్తించారు సిబ్బంది.

అప్పుడు వెంటనే హిందీ పేపర్లను విద్యార్థుల నుంచి తీసుకుని వాటికి బదులు తెలుగు పేపర్లు ఇచ్చారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు కాయా కష్టం చేసి పిల్లలని చదివిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల ఎగ్జామ్స్‌ విషయంలో స్కూల్‌ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మండిపడుతున్నారు. ఈ పని చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.