బ్రేకింగ్‌ :రేవంత్‌ అన్న వస్తేనే పెళ్లి చేసుకుంటా, కాంగ్రెస్‌ కార్యకర్త మొండిపట్టు

ఖమ్మం జిల్లా సింగరేణిపల్లి మండలంలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త వినూత్న డిమాండ్‌ చేశాడు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్త భుక్యా గణేష్‌కు రీసెంట్‌గా పెళ్లి సెట్‌ అయ్యింది

  • Written By:
  • Updated On - April 21, 2025 / 06:11 PM IST

ఖమ్మం జిల్లా సింగరేణిపల్లి మండలంలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త వినూత్న డిమాండ్‌ చేశాడు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్త భుక్యా గణేష్‌కు రీసెంట్‌గా పెళ్లి సెట్‌ అయ్యింది. అయితే తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్‌ గెస్ట్‌గా వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు గణేష్‌. తన పెళ్లికి సీఎం రావాలంటూ ప్రత్యేకంగా ఓ వినతి పత్రం కూడా రాసుకున్నాడు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌కు ఆ వినతి పత్రాన్ని అందించాడు.

తన పెళ్లికి సీఎం వచ్చేలా చూడాలంటూ కోరాడు. ఒకవేళ సీఎంకు తన పెళ్లి డేట్‌న ఖాళీ లేకపోతే.. రేవంత్‌ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే తన పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానంటూ వినతిపత్రం రాశాడు. గణేష్‌ కోరిక మేరకు ఆ వినతిపత్రాన్ని రాందాస్‌ నాయక్‌ సీఎం కార్యాలయానికి పంపించాడు. ప్రస్తుతం గణేష్‌ రాసిన లెటర్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. గణేష్‌ ఆహ్వానాన్ని మన్నించి సీఎం పెళ్లికి వస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.