బ్రేకింగ్: పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన భారత్‌

ఇండియా పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ను ఇండియా దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది.

  • Written By:
  • Publish Date - April 26, 2025 / 06:14 PM IST

ఇండియా పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ను ఇండియా దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది. అనంతనాగ్‌లో జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లు ఒక్కసారిగా ఎత్తేసింది. దీంతో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌, చకోటి ప్రాంతాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది.

ఆ ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండియా చేసిన ఈ చర్యతో పాక్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అటు పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లకుండా సింధు నదిపై ఉన్న డ్యాం గేట్లను మూసివేయడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది పాకిస్థాన్‌.