బ్రేకింగ్: సమాచారం లీక్‌ చేసి.. బాంబులు, పెట్టి జవాన్లను ట్రాప్ చేసిన పాక్‌ ఉగ్రవాదులు

ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన ఘటనలో పెద్ద ట్విస్ట్‌ చోటుచేసుకుంది. భారత్ జవాన్‌లను చంపేందుకు టెర్రరిస్ట్ ఆసిఫ్ మాస్టర్ ప్లాన్ వేశాడు.

  • Written By:
  • Publish Date - April 25, 2025 / 03:20 PM IST

ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన ఘటనలో పెద్ద ట్విస్ట్‌ చోటుచేసుకుంది. భారత్ జవాన్‌లను చంపేందుకు టెర్రరిస్ట్ ఆసిఫ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. జవాన్‌లను చంపేందుకు తన ఇంట్లోనే IED బాంబ్‌ను అమర్చాడు లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్. తన ఇంటి సమాచారం లీకయ్యేలా చేసి జవాన్లు అక్కడికి వెళ్లేలా చేశాడు.

ఆసిఫ్‌ ఇల్లు అదేనని తెలియడంతో ఇంటిని రౌండప్ చేశాయి భద్రతా బలగాలు. అప్పటికే కిచెన్ బయట IED బాంబ్‌ని అమర్చాడు ఉగ్రవాది ఆసిఫ్ షేక్. నల్లరంగు IED బాక్స్, వైర్లు గుర్తించి వెంటనే బయటకు వచ్చేశారు భద్రతా బలగాలు. వాళ్లు వచ్చిన కొన్నిక్షణాల్లోనే భారీ శబ్దంతో ఆసిఫ్‌ ఇల్లు పేలిపోయింది. ఈ పేలుడు నుంచి తృటిలో తప్పించుకున్నాయి భారత భద్రతా బలగాలు.