ఎంపీకి రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌ తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

  • Written By:
  • Publish Date - April 15, 2025 / 04:36 PM IST

సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌ తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడటం లేదు.. ప్రభుత్వంపై నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు.. వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దన్నారు.

మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుంది.. మీరు మాట్లాడేదంతా రికార్డవుతుందని హెచ్చరించారు. నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి మనపై విమర్శలు చేశారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీయే రంగంలోకి దిగారని అన్నారు. తెలంగాణ పథకాలతో మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు రేవంత్. ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని, ఏది పడితే అది మాట్లాడవద్దని, మంత్రి పదవుల విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు.